జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చరణ్, జాన్వి.. మెగాస్టార్
Cinema : సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నపుడు తానెపుడూ ‘మెగాస్టార్’ అవుతానని అనుకోలేదన్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో పాల్గొన్న చిరంజీవి .. అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలుపుతూ.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్ , జాన్వీ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని అన్నారు. దానికోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇటీవల జాన్వీతో మాట్లాడుతున్నపుడు కొంచెం భావోద్వేగంగా అనిపించదని.. శ్రీదేవి గుర్తుకువచ్చిందన్నారు. ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయిందన్నారు.
తనకు క్లాసికల్ సినిమాలు చేయాలని ఉండేదని, కానీ అభిమానులు మాస్ సినిమాల్లో నన్ను చూడాలనుకునేవారని తెలిపారు. కె.బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ చేశా.. నాకు మంచి పేరు వచ్చింది కానీ, ప్రొడ్యూసర్‌గా నా తమ్ముడికి లాభాలు రాలేదన్నారు. తాను బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి.. ప్రతీ దాన్ని బ్యాలెన్ చేయాలి. అందుకే నిదానంగా కమర్షియల్ వైపు వెళ్లాల్సివచ్చిందన్నారు. దంగల్ లాంటి సినిమాలు చేయొచ్చుకదా అని బాలసుబ్రహ్మణ్యం అన్నారని, కానీ నిర్మాతలు సంతోషంగా ఉండలేరన్నారు. తనకు ఫ్రీడం ఫైటర్ లాంటి సినిమాలు చేయలని ఉండేదని.. అందుకే సైరా చేశానన్నారు. ఆ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో యావరేజ్‌గా నిలిచిందని.. మిగాతా చోట్ల బాగానే ఆడిందన్నారు.