హరీశ్‌ వ్యాఖ్యలపై పలు అనుమానాలు: విజయశాంతి

హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు.

ఆమె ఫేస్ బుక్‌లో త‌న అభిప్రాయ‌న్ని వెలిబుచ్చారు…

“దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే… అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుంది. హరీష్ రావు గారి కామెంట్ చూస్తూ ఉంటే… దుబ్బాక లో పోలింగ్ జరిగిన తర్వాత… కెసిఆర్ గారి ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో? అనే అనుమానం కలుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా హరీష్ రావు గారు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదు. కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు గారి మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ గారు ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే… దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.“ అని విజ‌య‌శాంతి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.