అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారం ..
లద్దాఖ్ (CLiC2NEWS): అక్రమంగా బంగారం తరలిస్తున్న సమాచారం మేరకు భద్రతాదళం తనిఖీలు చేపట్టగా ఏకంగా 108 కిలోల బంగారం పట్టుబడింది. భారత్-చైనా సరిహద్దులో స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని ఇండో-టిబెటన్ బార్దర్ పోలీసు (ఐటిబిపి) బలగాలు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు లద్దాఖ్‌లోని న్యోమా ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని ఐటిబిసి వెల్లడించింది.