Ramagundam: రౌడీషీటర్ పై పిడి యాక్ట్
రామగుండం పోలీస్ కమీషనరేట్ (CLIC2NEWS): రౌడీ షీటర్ పై రామగుండం పోలీస్ కమిషనర్ మంగళవారం పిడియాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. పిడియాక్ట్ అమలుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్న మరి కొంతమంది జాబితా సిద్ధం చేశారు.
రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల పట్టణంలో ప్రజలను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులను భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురి చేస్తూ హత్యాయత్నం, అక్రమ ప్రవేశం, బెదిరింపులకు, దాడులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తిపై పిడియాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం, గుంజపడుగు గ్రామం చెందిన కుంట శ్రీనివాస్ పై రామగుండం సిపి ఎం. శ్రీనివాస్ పిడియాక్ట్ ఉత్తర్వలు జారీ చేశారు. నిందితుడి చర్లపల్లి జైలుకు తరలించారు.
గ్రూప్ లుగా ఏర్పడి గొడవలకు పాల్పడి శాంతి భద్రతలకు ఎలాంటి విఘతాం కలిగించే చర్యలకు పాల్పడిన, హత్య యాత్నలకు, హత్య లకు పాల్పడిన నిందితులు, అక్రమ ఫైనాన్స్, గంజాయి అక్రమ రవాణా చేసే వారి, పేకాట, పిడియస్ రైస్ అక్రమ రవాణా, భూ కబ్జాలకు పాల్పడే, వైట్ కాలర్ అఫెండార్స్ జాబితా సిద్ధం చేయడం జరిగిందని త్వరలో వారిపై పిడి అమలు చేస్తాం అని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది, సహించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయబడుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.