Eluru: 251 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సిఎం అభినంద‌న‌లు

ఏలూరు (CLiC2NEWS): చోరీకి గురైన 251 బైక్‌ల‌ను ఏలూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది అనుమానితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల‌ను ఛేదించిన పోలీసుల‌ను సిఎం చంద్ర‌బాబు అభినందించారు. రోజు వారి ర‌వాణా, జీవ‌నోపాధికి వాడే వాహ‌నాలు చోరీకి గురైన బాధితుల‌ కు స‌త్వ‌ర చ‌ర్య‌ల‌తో సేవ చేశార‌ని కొనియాడారు. కేసుల‌ను ఛేదించి బాధిత కుటుంబాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డానికి స‌రికొత్త సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు. త‌న బైక్‌ను తిరిగి పొందేట‌పుడు ఓ మ‌హిళ భావోద్వేగాలు క‌దిలించాయ‌ని సిఎం అన్నారు. ఈ మేర‌కు ఎపి పోలీసు శాఖ ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియోను సిఎం రీట్వీట్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.