పాశ‌మైలారం ప్ర‌మాదం.. మృతుల కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం 

సంగారెడ్డి (CLiC2NEWS):   సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌లం పాశ‌మైలారంలోని మందుల  ప‌రిశ్ర‌మ‌లో భారీ పేలుడు సంభ‌వించి అనేక మంది మృత్యువాత‌ప‌డ్డారు.   ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 36కు చేరింది. మృతుల  కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని సిఎం ప‌రిశీలించారు. ప్ర‌మాదానికి బాధ్యులైన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. మృతులు, క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌న్నారు.   మృతుల  కుటుంబాలకు రూ.కోటి చొప్పున ప‌రిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ యాజ‌మాన్యంతో మాట్లాడి ప‌రిహారం ఇప్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించ‌న‌ట్లు తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామ‌న్నారు. బాధితుల పిల్ల‌ల‌ను చ‌దివించే బాధ్య‌త తీసుకుంటామ‌ని సిఎం అన్నారు. ఇలాంటి ప్ర‌మాదాలు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సిఎం వెల్ల‌డించారు.

పాశ‌మైలారం ప్ర‌మాదంపై క‌మిటి ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి పాశ‌మైలారంలో రియాక్ట‌ర్ పేలుడు..12 మంది దుర్మ‌ర‌ణం

Leave A Reply

Your email address will not be published.