సంగారెడ్డి పాశమైలారంలో రియాక్టర్ పేలుడు..12 మంది దుర్మరణం
సంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక వాడ రసాయన పరిశ్రమలో సొమవారం రియాక్టర్ పేలి 12 మంది మృతి చెందారు. భారీ మంటలు వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు ధాటి భవనం కూలిపోగా.. ప్రక్కన ఉన్న మరో భవనానికి భీటలు ఏర్పడ్డాయి. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులలో మొత్తం 26 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వారిని చందానగర్, మదీనాగూడలోని ఆస్పత్రులకు తరలించి చికిత్సనందింస్తున్నారు. ఘటనా స్థలం నుండి ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్‌పి పరితోష్ పరిశీలించారు. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.