అంగ‌న్‌వాడి హెల్ప‌ర్ల ప‌దోన్న‌తి వ‌య‌స్సు పెంపు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడి హెల్ప‌ర్ల‌కు శుభ‌వార్త నందించింది. అంగ‌న్‌వాడి హెల్ప‌ర్.. టీచ‌ర్లుగా ప‌దోన్న‌తి కోసం గ‌రిష్ట వ‌యోప‌రిమితి (ప్ర‌మోష‌న్ వ‌య‌స్సు)ను 45 నుండి 50 ఏళ్ల‌కు పెంచుతూ మ‌హిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,322 మందికి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన ద‌స్త్రంపై మంత్రి సీత‌క్క సంత‌కం చేశారు. త్వ‌ర‌లో దీనిపై ఉత్త‌ర్వులు వెలువ‌డనున్న‌ట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.