ర‌హ‌దారుల‌పై మొస‌ళ్లు..

దేశంలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలువ‌లు ,న‌దులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ర‌హ‌దారుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌వుతున్నాయి. దీంతో భారీ మొస‌ళ్లు ర‌హ‌దారుల‌పైకి వ‌స్తున్నాయి. అంతేకాకుండా పంట పొలాల్లో సైతం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

గుజ‌రాత్‌లో ఇటీవ‌ల కురుస్తున్న వ‌ర్షాల‌కు వ‌ర‌ద నీరు ఉద్ధృతంగా ప్ర‌వ‌హిస్తుంది. గ్రామాలు, న‌గ‌రాలు జ‌ల‌మ‌య్యాయి. దీంతో పెద్ద ఎత్తున మొస‌ళ్లు జ‌నావాసాల్లోకి రావ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న చెందుతున్నారు.

రాజ‌స్థాన్‌లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తుంది. గ్రామాల్లో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు ఉద్ధృతంగా ప్ర‌వ‌హిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.