రామన్కాంత్ ముంజాల్ స్కాలర్షిప్
Raman Kant Munjal Scholarship: ఫైనాన్స్ సంబంధిత కోర్సులు చదవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్దులకు ఆర్ధిక సహాయం అందిస్తుంది. రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్షిప్ హీరో ఫిన్‌కార్ప్ మద్దతు ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తుంది. మూడేళ్ల డిగ్రీ కోర్సుల్లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు మూడు సంవత్సరాల పాటు రూ.50వేల నుండి రూ.5లక్షల వరకు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.
బిబిఎ, బిఎఫ్ ఐఎ, బికాం (హెచ్ఇ), బిఎంఎస్, ఐపిఎం, బిఎ (ఎకనామిక్స్), బిబిఐ, బిఎస్సి స్టాటిస్టిక్స్‌లో ప్రవేశాలు పొందిన వారు అర్హులు.
ఇంటర్మీడియట్లో కనీసం 80% మార్కులు సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6లక్షల లోపు ఉండాలి.
దరఖాస్తు దారుల వయస్సు 20 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జులై 31.