విమానాశ్రయాలకు ఉగ్రముప్పు..
అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్
న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత్ లోని ఎయిర్పోర్టుల భద్రతపై ఇంటెలిజెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2 -అక్టోబరు 2 మధ్య ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంది. విమానాశ్రయాల భద్రతకు ముప్పు ఉందని ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అన్ని ఏయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర విమానాయాన భద్రతా బ్యూరో అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది విమానాశ్రయాలకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు ముమ్మరం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే ఎయిర్ పోర్టుల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, లగేజీ కాని కనిపిస్తే తక్షణమే సిబ్బంది దృష్టికి తీసుకు రావాలని ప్రయాణికులకు సూచించారు.
తప్పక చదవండి: