గుమ్లాలో ఎన్ కౌంటర్
రూ. 15 లక్షల రివార్డుతో ఉన్న మావోయిస్టు మృతి
గుమ్లా (CLiC2NEWS): జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్ లో రూ. 15 లక్షల రివార్డుతో ఉన్న మావోయిస్టు మృతి చెందారు. గుమ్లా జిల్లాలో జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్లు బుధవారం గుమ్లా ఎస్పీ హరీస్ బిన్ జమాన్ మీడియాకి తెలిపారు.
ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ… గుమ్లాలో ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందింది.. దాంతో అక్కడ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాము.. ఈ క్రమంలో భద్రతా దళాలు కామ్దారా పోలీసు స్టేషన్ పరిధిలోని చంగబాడి ఉపర్టోలి ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు జరుగుతున్న సందర్భంలో మావోయిస్టు లు ఉన్నట్టుండి ఒక్కసారిగా భద్రతా దళాలలపై కాల్పులకు తెగబడ్డారు. దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పలు జరిపారు.. ఈ ఎన్ కౌంటర్లో నిషేధిత మావోయిస్టు చీలిక సంస్థ అయిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆప్ ఇండియా (పిఎల్ ఎఫ్ ఐ)కి చెందిన ఏరియా కమాండ్ మార్టిన్ కెర్కెట్టా మరణించాడు.. అని ఎస్పీ తెలిపారు.
తప్పకచదవండి: ఉత్తరకాశీలో వరద బీభత్సం..
[…] గుమ్లాలో ఎన్ కౌంటర్ […]