హాస్ట‌ల్‌లో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

నెల్లూరు (CLiC2NEWS):  హ‌నుమ‌కొండ‌లో ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం మ‌రువ‌క‌ముందే ఎపిలో నెల్లూరు హాస్ట‌ల్‌లో ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుని మృతి చెందింది. నెల్లూరు లోని ఓ ప్రైవేటు క‌ళాశాల వ‌స‌తి గృహంలో ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. స‌మాచారం అందుకున్న కుటుంబ‌స‌భ్యులు క‌ళాశాల యాజ‌మాన్యం వ‌ల‌నే త‌మ కుమార్తె చ‌నిపోయింద‌ని ఆరోపిస్తున్నారు. త‌ల్లిదండ్రులు విద్యార్థి సంఘాల‌తో క‌లిసి క‌ళాశాల ముందు బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. విద్యార్థి సంఘాల నేత‌లు కాలేజ్‌లోని అద్దాలు, ఫ‌ర్నిచ‌ర్ ధ్వంసం చేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేర‌కున్నారు. క‌ళాశాల ముందు ఆందోళ‌న చేస్తున్న వారిని అడ్డుకున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read: నా లాగా అర్ధం కాని చ‌దువు వ‌ద్దు.. ఇంట‌ర్ విద్యార్ధిని ఆత్మ‌హ‌త్య‌

 

Leave A Reply

Your email address will not be published.