హెడ్ కానిస్టేబుల్‌ షేక్ బహారలికి పోలీస్ సేవా పతకం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పోలీస్
పతకాలను అందజేసింది. ఖమ్మం లోని UBICC కరెన్సీ చేస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం హెడ్ కాన్స్టేబుల్ షేక్ బహారలికి తెలంగాణ పోలీస్ సేవా పతకం ప్రకటించినది.

స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా శుక్రవారం నాడు హైదరాబాద్ లో హోమ్ శాఖ ప్రిన్సిపాల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఐ,పి,ఎస్, తెలంగాణ పోలీస్ & ప్రత్యేక రక్షణ దళం,డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ Dr. అనిల్ కుమార్ ఐ,పి,ఎస్ ఈ పతకాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాధవరావు DIG, అన్వర్ పాషా కమాండంట్, దేవి దాసు కమాండంట్, త్రినాథ్ కమాండంట్, జంగయ్య కమాండంట్, బ్రహ్మ చారి, అడిషనల్ కమాండంట్, బాబురావు అసిస్టెంట్ కమాండంట్, చంద్ర శేఖర్ అసిస్టెంట్ కమాండంట్,ఇన్స్పెక్టర్ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.