AP, Telangana: జ‌లాశ‌యాలు నిండుకుండ‌లు

నాగార్జున సాగ‌ర్ (CLiC2NEWS): ఈ మ‌ధ్య కాలంలో ఎడ‌తెరిపిలేని వాన‌ల‌తో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండుకుండ‌ల్లా మారాయి. ఎగువ‌న కురుస్తున్న వాన‌ల‌తో కృష్ణ, గోదావ‌రి న‌దుల్లో భారీగా నీరు చేరుకుంటోంది.

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు భారీ వ‌ర‌ద‌

ఎగువ‌న కురిసిన భారీ వ‌ర్షాల‌తో శ్రీ‌శైలం ప్రాజెక్టు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. పైన ఉన్న సుంకేసుల ప్రాజెక్టు నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,98,022 క్యూసెక్కులు వ‌స్తోంది. దాంతో ప్రాజెక్టు నుంచి 5,13, 540 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు.

26 గేట్లు తెరిచిన సాగ‌ర్ ప్రాజెక్టు

కృష్ణా న‌దికి భారీగా వ‌ర‌ద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగ‌ర్ నిండుకుండ‌లా మారింది. తాజాగా సాగ‌ర్ జ‌ల‌శయానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుద‌ల చేశారు.

సాగ‌ర్ నీటి మ‌ట్టం 590 అడుగుల‌కు గాను ప్ర‌స్తుతం 583 అడుగుల‌కు చేరింది. ప్ర‌స్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,92,997 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,73, 053 క్యూసెక్కులు.

భ‌ద్రాచ‌లం వ‌ద్ద ఉగ్ర‌గోదావ‌రి

గోదావ‌రి న‌దికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో గోదావ‌రి న‌దిపై గ‌ల ప్రాజెక్టులు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకున్నాయి. శ్రీ‌రాంసాగ‌ర్‌, ఎల్లంప‌ల్లి ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుకుంది.

ఇక భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చింది. దాంతో బుధ‌వారం రెండో ప్రమాద హెచ్చ‌రిక జారీ చేశారు. గురువారం 50.8 అడుగుల మేర ప్ర‌వ‌హిస్తోంది. భారీగా వ‌ర‌పోటు ఎక్కువ కావ‌డంతో ర‌హ‌దారుల‌పైకి నీరు చేరింది. ఇప్ప‌టికే గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతంలోని ప‌లు ర‌కాల పంట‌లు ముంపున‌కు గుర‌య్యాయి.

ర‌హ‌దారుల‌పైకి వ‌ర‌ద నీరు రావ‌డంతో రాక‌పోక‌లు పూర్తిగా స్తంభించాయి. భ‌ద్రాచ‌లం ప‌రిస‌ర‌గ్రామాల్లోని ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. దాంతో గోదావ‌రి క‌ర‌క‌ట్ట‌కు ఉన్న స్లూయిజ్‌ల‌ను అధికారులు మూసేశారు.

ధ‌వ‌ళేశ్వ‌రం వ్ద‌ద ప్రాజెక్టుకు 9.88 ల‌క్ష‌ల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో న‌మోదైంది. దాంతో అదే స్థాయిలో నీటిని దిగువ‌కు విడుద‌ల చేశారు. ప్రాజెక్టు వ‌ద్ద 11.9 అడుగుల నీట్టం న‌మోదైంది. గోదావ‌రికి వ‌ర‌ద ఉధృత‌మ‌వ్వ‌డంతో తూ.గో, కాకినాడ‌, ఏలూరు, ప‌.గో జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

Also Read : సికింద్రాబాద్ నుండి బ‌య‌లుదేరే ప‌లు రైళ్ల‌ స్టేష‌న్‌లు మార్పు

1 Comment
  1. […] AP, Telangana: జ‌లాశ‌యాలు నిండుకుండ‌లు […]

Leave A Reply

Your email address will not be published.