Telangana: వైద్య‌శాఖ‌లో 1,623 పోస్టులు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వైద్యారోగ్య శాఖ‌లో 1,623 పోస్టుల‌కు శుక్ర‌వారం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రాష్ట్ర వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలోని ఆస్ప‌త్రుల‌లో 1616 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్ పోస్టులు, ఆర్‌టిసి ఆస్ప‌త్రుల్లో 7 మెడిక‌ల్ ఆఫీస‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టులు క‌ల‌వు. ఈ పోస్టుల‌కు సెప్టెంబ‌ర్ 8 నుండి 22వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

సివిల్ అసిస్టెంట్ స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ పోస్టుల‌కు ఎంపికైన వారికి రూ.58,850 నుండి రూ. 1,37,050 వేత‌నం అందుకోవ‌చ్చు. మెడిక‌ల్ ఆఫీస‌ర్ స్పెష‌లిస్ట్ పోస్టుల‌కు ఎంపికైన వారు నెల‌కు వేత‌నం రూ. 56,500 – 1,31,000 ఉంటుంది.

 

 

1 Comment
  1. […] Telangana: వైద్య‌శాఖ‌లో 1,623 పోస్టులు […]

Leave A Reply

Your email address will not be published.