బీహార్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు!

బీహార్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు!

పాట్నా: బీహార్‌లో లాక్‌డౌన్ పొడిగించారు.. భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు ఉదృత‌మ‌వుతోంది. కొవిడ్‌ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌డంతో బీహార్‌లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కాగా బిహార్‌లో కరోనా కేసుల దృష్ట్యా జూలై 31 నుంచి ఆగష్టు 16 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు నిన్నటితో ముగియడంతో లాక్‌డౌన్‌ను మరో 20 రోజులపాటు పొడిగించారు. ఇక రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 3,814 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1,03,283కి చేరింది.
రాష్ట్రంలో ఇంకా కేసుల పెరుగుద‌ల అదుపులోకి రాక‌పోవ‌డంతో సోమ‌వారం బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించి లాక్‌డౌన్ పొడిగిస్తూ కొత్త ఉత్త‌ర్వులు జారీ చేసింది. ముఖ్య‌మంత్రి నితిష్‌ కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మేర‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని బీహార్ రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేస్తాయి. రైలు, విమాన సర్వీసులు యధాతథంగా కొనసాగుతాయి. కానీ అన్ని విద్యాసంస్థలు, మతపరమైన ప్రదేశాలు, బస్సు సర్వీసులు, పార్క్‌లు, జిమ్ములు, ఇంకా మూసే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.