సింగ‌రేణి కార్మికులు బోన‌స్

హైద‌రాబాద్‌(CLiC2NEWS): తెలంగాణలోని సింగ‌రేణి కార్మికుల‌కు స‌ర్కార్ శుభ‌వార్త చెప్పింది. కార్మికుల‌కు బోన‌స్‌ను స‌ర్కార్ ప్ర‌క‌టించింది. సంస్థ‌లాభాల్లో 34% కార్మికుల‌కు అంద‌జేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు హైద‌రాబాద్ లో మంత్రుల‌తో క‌లిసి మీడియాతో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

ఈ లెక్క‌న ఒక్కో కార్మికుడికి బోన‌స్‌గా రూ. 1,95, 610 ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. కాంట్రాక్టు కార్మికుల‌కు కూడా బోన‌స్ చెల్లిస్తామ‌ని డిప్యూటీ సిఎం భ‌ట్టి తెలిపారు. వీరికి బోన‌స్ ఇవ్వ‌డం చ‌రిత్ర‌లోనే తొలిసారిగా పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధ‌న‌లో సింగ‌రేణి కార్మికుల పాత్ర మ‌రువ‌లేనిదని అన్నారు. కార్మికుల‌కు బోన‌స్ పంచుతూనే భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌మ‌ని తెలిపారు. మా పార్టీ అధికారంలోకి వ‌చ్చాక సింగ‌రేణి కాంట్రాక్టు ఉద్యోగుల‌కు కూడా బోన‌స్ ఇస్తున్నామ‌ని తెలిపారు.

Also Read: మోహ‌న్‌లాల్‌కు ఫాల్కే

2 Comments
  1. […] సింగ‌రేణి కార్మికులు బోన‌స్ […]

Leave A Reply

Your email address will not be published.