బస్ భవన్ వద్ద ఉద్రిక్తత.. భారీగా చేరుకున్న బిఆర్ ఎస్ శ్రేణులు
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో టి ఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, తలసాని, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలు బస్ భవన్ కు చేరుకున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు మెహిదీపట్నం నుంచి బస్ భవన్‌కు చేరుకున్నారు. అలాగే కెటిఆర్, పద్మారావు, తలసాని సికింద్రాబాద్ రేతిఫల్ నుంచి బస్ భవన్ కు చేరుకున్నారు. వీరంతా బస్సు చార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఎండికి వినతిపత్రం ఇవ్వనున్నారు.
వీరి రాకతో బస్ భవన్ ప్రాంతానికి బిఆర్ ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Also Read: రూ. 53 లక్షల జాక్‌పాట్ కొట్టిన నాలుగేళ్ల లక్కీబాయ్

[…] బస్ భవన్ వద్ద ఉద్రిక్తత.. భారీగ… […]