ఆర్మీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్ పోస్టులు
పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి, ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 14వ తేదీ లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు లేదు.
నోటిఫికేషన్ నుండి దరఖాస్తును ప్రింటవుట్ తీసుకుని పూర్తి చేసి, సంబంధిత ధ్రువ పత్రాలను జతచేసి పంపించాల్సి ఉంది.
కమాండెంట్, 1, ఇఎఇ సెంటర్ , సికింద్రాబాద్ -500 087 చిరునామాకు ఆర్డినరీ పోస్టులో పంపించాల్సి ఉంది
రాత పరీక్ష , స్కిల్ టెస్ట్‌తో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 37: పదో తరగతి, ఏదైనా ట్రేడ్‌తో ఐటిఐ, ఏడాది అనుభవం ఉండాలి.
ప్రశ్నాపత్రంలో నాలుగు పార్టులుంటాయి. పార్ట్ 1 లో జనరల్ ఇంటిలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్-2 లో జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్ -3 లో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు ఉంటాయి.
పార్ట్-4లో న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు ఉంటాయి.
క్లర్క్ పోస్టులు 25 : ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లిష్ టైపింగ్ వేగం నిమిషానికి 35
పదాలు ఉండాలి. లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి.
వయస్సు: అభ్యర్తుల వయస్సు 18-25 ఏళ్ళు ఉండాలి. ఎస్సి, ఎస్టికు ఐదేళ్లు, ఒబిసి- ఎన్సిఎల్కు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుండి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రం: వర్క్‌షాప్ షెడ్, 3 ట్రెయినింగ్ బెటాలియన్, 1 ఇఎఇ సెంటర్ , సికింద్రాబాద్ -500 087.
[…] […]