కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట‌: 9 మంది మృతి!

శ్రీ‌కాకుళం(CLiC2NEWS): శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో శ‌నివారం జరిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది భ‌క్తులు మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో ప‌లువురుకి తీవ్ర గాయాల‌య్యాయి.

శ‌నివారం వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీగా పోటెత్తారు. ఈ సంద‌ర్భంగా చోటుచేస‌కున్న తొక్కిస‌లాట‌లో ప‌లువురు భ‌క్తులు స్పృహ కోల్పోయారు. ఘ‌ట‌నాస్థ‌లిలో 7 గురు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

కాశీబుగ్గ తొక్కిస‌లాట బాధితుల‌ను ఓదార్చుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

మృతుల్లో 8 మంది మ‌హిళ‌లు, ఒక 12 యేళ్ల బాలుడు ఉన్నారు. గాయ‌ప‌డిన వారిలో మ‌రికొంద‌రి ప‌రిస్థ‌తి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌నాస్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఘ‌ట‌నా స్థ‌లికి మంత్రి అచ్చెన్నాయుడు

కాశీబుగ్గ తొక్కిస‌లాట విష‌యం తెలుసుకున్న ఎపి వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు ఘ‌ట‌నాస్థ‌లిని సంద‌ర్శించారు. మంత్రి క్ష‌త‌గాత్రులు ఓదార్చారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను దగ్గ‌రుండి ప‌ర్వ‌వేక్షిస్తున్నారు.

సిఎం చంద్రాబాబు దిగ్భ్రాంతి

కాశీబుగ్గ ఘ‌ట‌న‌పై ఎపి సిఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలియ‌జేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్ష‌త‌గాత్రుల‌కు త‌గిన వైద్యం అందించాల‌ని సూచించారు.

Also Read: జ‌న‌గామ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు

2 Comments
  1. […] కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట‌: 9 మంద… […]

  2. […] కాశీబుగ్గ ఆల‌యంలో తొక్కిస‌లాట‌: 9 మంద… […]

Leave A Reply

Your email address will not be published.