వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి కరోనా
చంఢీఘర్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హర్యానా వైద్యశాఖ మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా నవంబర్ 20న విజ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంతరం రాష్ట్రం నుండి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గన్న మొదటి వాలంటీర్‌ను తానేనంటూ ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్ తేలిందని అనిల్ విజ్ స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని, దీంతో అంబాలాలోని సివిల్ ఆస్పత్రిలో చేరినట్లు ట్వీట్ చేశారు. గత వారం నుండి తనకు సన్నిహితంగా ఉన్నవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
I have been tested Corona positive. I am admitted in Civil Hospital Ambala Cantt. All those who have come in close contact to me are advised to get themselves tested for corona.
— ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 5, 2020