ఏలూరు ఘటనలో ఒకరు మృతి.. పెరుగుతున్న బాధితులు!
ఏలూరు: ఏలూరులో ఆకస్మికంగా అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతిచెందారు. విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) అనే వ్యక్తి నిన్న (ఆదివారం) రాత్రి మృతిచెందారు. తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి మరణించారు. శనివారం రాత్రి వందల మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరిన సంగతి తెలిసిందే. ఏలూరులో పరిస్థితులు వైద్యాధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఓ వైపు కొందరు కోలుకొని డిశ్చార్జి అవుతుంటే.. మరోపక్క మరికొందరు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు 140 మంది డిశ్చార్జి కాగా, అస్వస్థతకు గురై ఆదివారం ఉదయం నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 40 మందికి పైగా, ఇతర ప్రయివేటు అస్పత్రుల్లో మరో 60 మందికి పైగా చేరారు. వారిలో విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ మృతిచెందాడు. ఈ ఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.