మ‌ల్లాపూర్‌లో శివ‌లింగాన్ని తాకిన సూర్య‌కిర‌ణాలు

మ‌ల్లాపూర్ (CLiC2NEWS): ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా ఆల‌యాల‌కు భ‌క్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ‌లోని జ‌గిత్యాల జిల్లా మ‌ల్లాపూర్ మండ‌లంలోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం వాల్గొండ రామ‌లింగేశ్వ‌ర స్వామి శివ‌లింగాన్ని ఇవాళ (మంగ‌ళ‌వారం) సూర్య‌కిర‌ణాలు తాకాయి. ముక్కోటి ఏకాద‌శిరోజున మాత్ర‌మే లింగాన్ని సూర్య‌కిర‌ణాలు తాక‌డం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త. దాదాపు వెయ్యేళ్ల (1000 సంవ‌త్స‌రాల‌) కింద నిర్మించిన ఆల‌యంలో ముక్కోటి ఏక‌ద‌శి ఇక్క‌డ ప్ర‌త్యేక‌త అని ఆల‌య పూజారులు తెలిపారు. దాంతో ఈ ఆల‌యానికి ఇవాళ భారీ ఎత్తున భ‌క్తులు పోటెత్తారు.

Also Read: T-20 World Cup-2026 టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

2 Comments
  1. […] మ‌ల్లాపూర్‌లో శివ‌లింగాన్ని తాకిన స… […]

  2. […] మ‌ల్లాపూర్‌లో శివ‌లింగాన్ని తాకిన స… […]

Leave A Reply

Your email address will not be published.