కానిస్టేబుల్ ఉద్యోగార్థుల‌కు శుభ‌వార్త.. ఎపి ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలో కానిస్టేబుల్ అభ్యుర్థుల‌కు సిఎం జ‌గ‌న్ గుడ్‌న్యూస్ తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు రెండేళ్ల వ‌య‌స్సును స‌డ‌లిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌యోప‌రిమితిని రెండేళ్లు పెంచుతూ ముఖ్యమంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఎపిలో ఇటీవ‌ల‌ 6,100 కానిస్టేబుల్‌,411 ఎస్ ఐ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అప్ప‌టినుండి వ‌యోప‌రిమితి పెంచాలంటూ అభ్య‌ర్థులు ప్ర‌భుత్వాన్ని కోర‌డంతో.. వారి విజ్ఞ‌ప్తి మేర‌కు తాజాగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.