AP: సీలేరులో మునిగిన నాటుపడవలు.. 8 మంది గల్లంతు
విశాఖ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సీలేరు నదిలో రెండు నాటుపడవలు నీట మునిగాయి. ఈ ఘటనలో 8 మంది గల్లంతు అయ్యారు. వారిలో ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు స్థానికులకు సమాచారం అందించారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా గిరిజనులు ఒడిశా వెళ్లేందకు నాటు పడవలోవెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాక్డౌన్ ప్రభావంతో హైదరాబాద్ నుంచి వలస కూలీలు 11 మంది గిరిజనులు స్వగ్రామాలకు బయల్దేరారు. అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు. నదిలో ముందుగా వెళ్లిన నాటుపడవ మునిగి పోయి… రెండో పడవకు తగలడంతో గిరిజనలు నీటమునిగారు. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి కోసం అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.