Corona Vaccine: నాసల్ డ్రాప్ టీకాకు ఆమోదం తెలిపిన కేంద్రం..
ఢిల్లీ (CLiC2NEWS): కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌గా నాసల్ డ్రాప్ టీకా తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ అధికార వర్గం వెల్లడించింది. భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నందున కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి అరికట్టడానికి పలు సూచనలు చేసింది. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన టు డ్రాప్ నాసల్ టీకాకు కేంద్ర ఆరోగ్య శాఖ అమోందించింది. నేటి నుండి ఈ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రులలో లభ్యంమవుతుంది. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు తీసుకున్నావారు బూస్టర్ డోస్‌గా ఈ నాసికా టీకాను తీసుకోవచ్చని వెల్లడించారు.
ప్రపంచ దేశాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తుంది. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో చుక్కల మందు టీకా ఇన్‌కొవాక్‌ను బూస్టర్ డోసుగా ఆమోదించింది. శుక్రవారం సాయంత్రం నుండి కొవిన్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ 18 ఏళ్ల వయసు దాటిన వారు తీసుకోవచ్చని సమాచారం.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?