గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా బతుకమ్మ సంబరాలు: మంత్రి జూపల్లి
హైదరాబాద్ (CLiC2NEWS): గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించే లక్ష్యంగా రాష్ట్రంలో తెలంగాణ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21 నుండి 30 వరకు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 29వ తేదీన ఎల్‌బి స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుతామన్నారు. పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు జరగనున్నట్లు తెలిపారు. తెలంగాన రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనే ఈ వేడుకలు నిర్వహిస్తామన్నారు.
సోమవారం మీడియా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి జూపల్లి పాల్గొన్నారు. బతుకమ్మ పండుక ను గొప్ప కార్నివాల్గా నిర్వహిస్తామని ఈ సందర్భంగా జూపల్లి తెలిపారు. బతుకమ్మ జాతీయ స్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పండుగ గురించి, తెలంగాణ సంస్కృతి గురిచి దేశ విదేశాలకు తెలిసేలా నిర్వహిస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు.