అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి

కాబూల్‌ (CLiC2NEWS): అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఆదివారం అర్ధ‌రాత్రి భూకంపం సంభ‌వించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లోని కునార్‌ ప్రావిన్స్‌లో భూకంప తీవ్ర‌త న‌మోదైంది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.0గా న‌మోదైంది. నంగార్హార్‌లోని జ‌లాలాబాద్ స‌మీపంలో 8 కిలోల మీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్లు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్లోని కునార్‌, నోరిస్తాన్‌, నంగ‌ర్హార్ ప్రావిన్స్‌లు భూకంపం కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. ఇళ్లు కూలిపోయి ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 2500 మందికి వ‌ర‌కు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.

 

Telangana: `కాళేశ్వ‌రం`పై సిబిఐ విచార‌ణ: సిఎం రేవంత్‌

Leave A Reply

Your email address will not be published.