తెలుగు రాష్ట్రాలకు బిజెపి అధ్యక్షులు ఖరారు
BJP: తెలుగు రాష్ట్రాల బిజెపి అధ్యక్షులను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. తెలంగాణ బిజెపి అద్యక్షుడిగా మాజి ఎమ్మెల్సి రామచందర్‌రావు .. ఎంపి మాజి ఎమ్మెల్సి పివిఎన్ మాధవ్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది.
రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరిని నియమించాలన్న విషయంపై గత కొన్ని రోజులుగా కసరత్తులు జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిరువురు సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారు. మంగళవారం అధ్యక్ష ఎన్నక నిర్వహించనున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నికలు జరుగుతాయి.
పివిఎన్ మాధవ్.. బిజెపి సీనియర్ నేల, దివంగత చలపతిరావు కుమారుడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్విగా వ్యవహరిస్తున్నారు. గతంలో శానస మండలిలో బిజెపి ఫ్లోర్ లీడర్‌గా .. ఆర్ ఎస్ ఎస్, బిజెవైఎంలో భాద్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి పోటీ బరి లో ఎంపిలు ఈటల, ధర్మపురి అర్వింద్, కెజ లక్ష్మణ్, మాజి ఎమ్మెల్సి రామచందర్‌రావు పేర్లు బలంగా వినిపించాయి.