రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్)లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
RITES: సివిల్ ఇంజినీరిగ్ / మెరైన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ సేప్టి డిప్లొమా/ డిగ్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ / సైన్సెస్ / జియో టెక్నికల్ ఇంజినీరింగ్ / సివిల్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ / రిమోట్ సెన్నింగ్ / జియో ఇన్పర్మాటిక్స్‌తో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు రైట్స్‌లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
డిజిఎం -4
అసిస్టెంట్ మేనేజర్ 14 పోస్టులు కలవు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40వేల నుండి రూ.లక్షా నలభై వేల వరకు మూల వేతనం అందుతుంది. అదనంగా డిఎ, హెచ్ ఆర్ ఎ/ లీజ్ అకామడేషన్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్, పిఎఫ్, గ్రాట్యుటి, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్ వైద్య సదుపాయాలు కూడా ఉంటాయి.
ఎంపిక రాత పరీక్ష , ధ్రువ పత్రాల పరిశీలన , ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు. దరఖాస్తులను వచ్చే నెల 27వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. 35 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 600. ఇడబ్ల్యుఎస్ / ఎస్‌సి/ ఎస్ టి / దివ్యాంగులకు రూ.300గా నిర్ణయించారు.
పరీక్షలను హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గువాహటి, గుర్‌గ్రామ్/ ఢిల్లీ, కోల్‌కతాలో నిర్వహిస్తారు.
పరీక్ష తేదీ, వివరాలను ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు.