కామారెడ్డిలో కొట్టుకుపోయిన వంతెన‌

కామారెడ్డి (CLiC2NEWS): గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలు తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో బీభ‌త్సం సృష్టించాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా భారీ వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌లం అవుతోంది. జిల్లాలో ప‌లు ప్రాంతాలు వ‌ర‌ద‌మ‌య‌మ‌య్యాయి. ఇప్ప‌టికే భిక్క‌నూర్ స‌మీపంలో రైలు ప‌ట్టాల కింద గండి ప‌డ‌డంతో రైళ్ల ప్ర‌యాణాలు స్తంభించిపోయాయి.

కుంభ‌వృష్టి వాన‌ల‌కు జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. బీబీపేట నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో వ‌ర‌ద ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాంతాల్లో రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

Also Read : Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం

Leave A Reply

Your email address will not be published.