కామారెడ్డి ప‌ట్ట‌ణంలో అస్త‌వ్య‌స్థ‌మైన రోడ్లు (vedio)

కామారెడ్డి (CLiC2NEWS): గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలు తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో బీభ‌త్సం సృష్టించాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా భారీ వ‌ర‌ద‌ల‌కు అత‌లాకుత‌లం అవుతోంది. జిల్లాలో ప‌లు ప్రాంతాలు వ‌ర‌ద‌మ‌య‌మ‌య్యాయి.

కుంభ‌వృష్టి వాన‌ల‌కు కామారెడ్డి ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ప‌ట్ట‌ణంలోని బైపాస్ కు వెళ్లే దారిలో హౌజింగ్‌బోర్డు కాల‌నీ, జిఆర్ కాల‌నీ వెళ్లే దారిలో రోడ్డు అస్త‌వ్య‌స్థంగా త‌యారైంది. దాంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

 

Also Read : Kamareddy:కామారెడ్డిలో వ‌ర‌ద బీభ‌త్సం

Leave A Reply

Your email address will not be published.