న‌ల్ల‌గొండ జిల్లాలో డివైడ‌ర్‌ను ఢీ కొని ప‌ల్టీ కొట్టిన కారు

చిట్యాల (CLiC2NEWS): న‌ల్ల‌గొండ జిల్లాలో ఇన్నోవా కారు ప్ర‌మాదానికి గురైంది. జిల్లాలోని చిట్యాల మండ‌లం గుండ్రాంప‌ల్లి వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

మంట‌ల్లో కాలిపోతున్న కారు

 

ఈ ప్ర‌మాదంలో ఇన్నోవా కారు డివైడ‌ర్‌ను ఢీ కొట్టి ప‌ల్టీ కొట్టింది. ఆ సమ‌యంలో కారులో మంట‌లు చెల‌రేగి పూర్తిగా ద‌గ్ధ‌మ‌యింది. కాగా ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మంట‌ల్లో కాలిపోతున్న కారు

 

Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికుల ఆందోళ‌న‌!

Leave A Reply

Your email address will not be published.