శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్ర‌యాణికుల ఆందోళ‌న‌!

శంషాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప‌లువురు ప్ర‌యాణికులు ఆందోళ‌న చేప‌ట్టారు.శుక్ర‌వారం రాత్రి నుంచి వియ‌త్నాంకు చెందిన విఎన్‌-984 విమానం ప‌లు కార‌ణాల వల్ల స‌ర్వీసు నిలిపివేశారు. దాంతో దాదాపు 200 మంది ప్ర‌యాణికులు శుక్ర‌వారం రాత్రి విమానాశ్ర‌యంలోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. ఈ విష‌యమై విమానాశ్ర‌య అధికారుల‌ను ప్ర‌యాణికులు సంప్ర‌దిస్తే నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇస్తున్నార‌ని వారు ఆందోళ‌న చేప‌ట్టారు. దాంతో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అలాగే కౌలాలంపూర్ వెళ్లాల్సిన విమానంలోనూ సాంకేతిక స‌మ‌స్యలు వ‌చ్చాయి. దాంతో ఆ విమానం శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి నిర్దేశించిన స‌మ‌యం క‌న్నా దాదాపు 6 గంట‌లు ఆల‌స్యంగా బ‌య‌లుదేరింది.

Alsor Read: NFC: ప‌దో త‌ర‌గ‌తి, ఐటిఐ అర్హ‌త‌తో 405అప్రెంటిస్ ఖాళీలు

 

Leave A Reply

Your email address will not be published.