ఎనిమిది కొత్త వైద్య విద్య కాలేజీల‌ను ప్రారంభించ‌నున్న సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 8 ప్ర‌భుత్వ‌ వైద్య విద్య కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నేడు క‌ళాశాల‌ల‌ను ప్రారంభించ‌నున్నారు. జిల్లాకో వైద్య క‌ళాశాల రావాల‌నే సిఎం ఆకాంక్ష సాక‌ర‌మ‌య్యే రోజు వ‌చ్చింది. వీట‌న్నింటిలో ఈ ఏడాది నుండే ఎంబిబియ‌స్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. ఈ కాలేజీల ద్వారా 1,150 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మొత్తం 12 కొత్త వైద్య క‌ళాశాల‌లు విద్యార్థుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

1 Comment
  1. 打开Binance账户 says

    Your article helped me a lot, is there any more related content? Thanks!

Leave A Reply

Your email address will not be published.