ఆరోగ్యమే మహాభాగ్యం
ప్రస్తుతం ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి, వాతావరణం మార్పుల వలన, మనం తినే ఆహారంలో క్వాలిటీ లేకపోవటం,పంటల బాగా పండాలని ఎరువులు విచ్చల విడిగా వాడటం.కల్తీ మందులతో వరి, జొన్న, ఆకు కూరలు, కూరగాయలు, పండించటం, జీవనశైలిలో మార్పు రావటం. సరైన సమయానికి సరైన ఆహారం తినకపోవటం, ఉద్యోగరీత్యా సమయం తక్కువగా ఉండటం వలన కడుపుకి సరిగా తిండి తినకపోవటం.
భోజనం తినే time లో భోజనం చేయకుండా బయట బజారులో దొరికే టిఫిన్స్, టీ, కాఫీ లు పిజ్జా, బర్గర్, నూడిల్, స్నాక్స్, కేక్స్, కూల్డ్రింక్స్, గుప్ చుప్, ఇడ్లీ, వడ, దోస, ఇలాంటివి తినటం,
కాలాన్ని బట్టి వచ్చే పండ్లు, ఇప్పుడే సీతకాలంలో వచ్చే జామకాయ, రేగు పండు, బత్తాయి, కివి, సపోటా, దానిమ్మ, ఊసిరికాయ, సీతాఫలాలు, ఆపిల్స్,తినకపోవటం మరియు ఈ కాలంలో వచ్చే పాలకూర హీమోగ్లోబిన్ పెంచుతుంది. మెంతికూర షుగర్ ని కంట్రోల్ పెడితుంది., గాల్ బ్లాడర్ లో, కిడ్నీలో రాళ్లు,శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటే పగలగొట్టే బచ్చలి కూర.

శరీరంలో నీటి కొరతను తగ్గించేందుకు సొరకాయ (anapakaya) కపాన్ని తగ్గించే కాకరకాయ, మలబద్ధకం తగ్గించేందుకు ఫైబర్ food చిక్కుడుకాయ, గోరుచిక్కుళ్ళు, టమాటా,బీన్స్, బీరకాయ. రక్తంలో ఐరన్ శాతం పెంచటానికి గోంగూర, వంకాయ, ఆంటీ బయోటిక్ గా పనిచేయటాని ముల్లంగి, హిమోగ్లోబిన్ పెరగటానికి బీట్ రూట్, పోదినా, కోత్తిమీర, చుక్కకూర, గంగవాయిలీ కూర
క్యారట్ తింటే కంటి చూపుకి రక్తశుద్ధికి పనిచేస్తుంది. బెండకాయ, మునక్కాయ మోకాళ్ళ నొప్పులకు చక్కగా పనిచేస్తాయి.అవసలు, జొన్నల జావా, రాగి జావా, బియ్యం గంజి, మొక్కజొన్న పొత్తులు మోకాళ్ళ నొప్పులకు, మలబద్ధకంకు, తగ్గించటానికి ఉపయోగకరంగా ఉంటుంది.ఇలా ఇవన్నీ తినకపోవటం వలన శరీరంలో సరైన విటమిన్స్ అందకపోవటం వలన విటమిన్ లోపంతో రోగాలు రావటం జరుగుతుంది.
విటమిన్స్ లోపం రాకుండా మరియు శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవటానికి కాలాన్ని బట్టి ఆహారపదార్దాలు తీసుకుంటే సాధ్యమైనంత వరకు రోగాలు రావు.

హిత్భుక్, మిత్భుక్, రూత్భుక్, కాలాన్ని బట్టి వచ్చే ఆహారపదార్దాలు,మరియు త్వరగా జీర్ణం అయ్యేవి ఆహారం, పరిమితమైన ఆహారం తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది.
మరియు దీనితో పాటు రోజువారీగా శరీరానికి కనీసం 30 నిముషాలు అయిన వ్యాయామం అవసరం, cycle తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం, రన్నింగ్ చేయటం, వాకింగ్ చేయటం, చిన్న చిన్న ఆటలు ఆడటం, యోగ చేయటం, ఇలాంటివి చేస్తే శారీరక, మానసిక రోగాలు రావు. కనుక మనమందరం ఈ రోజు కాలానికి అనుగుణంగా తింటూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకుందాం. దేశానికీ సేవ చేస్తాం.ప్రజలను రోగ విముక్తులుగా చేయటం.ఆరోగ్యకరమైన భారత దేశంగా మారుస్తాం.నవజీవన జాగరణకు, యువజన నారిజన చైతన్య లోకం కొరకు అందరు సమిష్టి కృషితో ఆరోగ్యంగా ఉందాం.
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు
I know this if off topic but I’m looking into starting my own blog and was wondering what all is needed to get set up? I’m assuming having a blog like yours would cost a pretty penny? I’m not very web savvy so I’m not 100 certain. Any recommendations or advice would be greatly appreciated. Thank you
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.