కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఉయ్యూరు (CLiC2NEWS): ఎపిలోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జాతీయ రహదారిపై ఓ కారు పల్లీలు కొట్టిన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి నేషనల్ హైవే నుంచి సర్వీసు రోడ్డు మీదకు పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొదుతూ ఆసుపత్రిలో మరణించారు. సమాచారమందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
[…] […]