Delhi: ఎర్రకోటలో బంగారు కలశాలు చోరీ
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో సుమారు రూ.కోటి విలువ ఉండే బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి. సెప్టెంబర్ 3వ తేదీన ఎర్రకోటలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. పూజ కోసం వినియోగించిన బంగారు కలశాలు.. 760 గ్రాముల బంగారు కలశం, వజ్రాలు, మాణిక్యాలు , పచ్చలతో పొదిగిన 115 గ్రాముల మరో బంగారు కలశం చోరీకి గురయ్యాయి. వీటిని తీసుకొచ్చిన వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలంలోని సిసి కెమెరాలను పరిశీలించగా.. పూజా కార్యక్రమం అనంతరం ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజ సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లి , కలశాలు దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు గతంలో పలు ఆలయాల్లో చోరీలు చేసినట్లు ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
[…] Delhi: ఎర్రకోటలో బంగారు కలశాలు చోరీ […]