4.4 తీవ్ర‌త‌తో ఢిల్లీలో భూప్ర‌కంప‌న‌లు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం ఉద‌యం భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 4.4గా న‌మోదైంది. ఢిల్లీ, ఎన్‌సిఆర్ ఆర్ స‌హా ప‌లు ప్రాంతాల్లో భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యంతో ఇళ్ల నుండి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. హ‌రియాణాలోని ఝ‌జ్జ‌ర్‌లో 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్ర వెల్ల‌డించింది. ప‌శ్చిమ ఢిల్లీకి కేవ‌లం 51 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంటుంది. గ‌తంతో పోలిస్తే ఈ సారి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. ఢిల్లో లోనే కాకుండా రాజ‌స్థాన్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో స్వ‌ల్పంగా భూమి కంపించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.