సినీ పరిశ్రమలో మరో విషాదం.. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఆయన అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. ఆయన వందకు పైగా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.
వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం ఆస్పత్రిలో చేరారు. తనకి రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్నారని, దాతలు సాయం చేయాల్సిందిగా ఆమె కోరారు.