అభివృద్ది పనులకు ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 50కోట్లు.. సిఎం సిద్దరామయ్య
బెంగళూరు (CLiC2NEWS): రాష్ట్రంలో అభివృద్తి పనుల నిమిత్తం ఒక్కో ఎమ్మెల్యేకి రూ.50కోట్ల గ్రాంట్ విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని పార్టి ఆఫీసులో ఒక్కో ఎమ్మెల్యేతోటి ఆయన విడివిడిగా మాట్లాడారు. నిధుల జాప్యంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులు కుంటుపడుతున్నాయని వారు వివరించారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు కోసం నిధులు సరిపోవడం లేదని రణదీప్ సుర్జేవాలాకు ఎమ్మెల్యేలు మొరపెట్టుకున్నారు. ఈ విషయాన్ని సిఎం , డిప్యూటి సిఎం డికె శివకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై చర్చలు జరిపి.. గ్రాంట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. దీంతో ప్రతి ఎమ్మెల్యే రూ.50 కోట్ల గ్రాంట్‌ను పొందనున్నారు.