కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
కర్నూలు (CLiC2NEWS): కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కోటేకల్ వద్ద జరిగింది. కర్ణాటకకు చెందిన ఏడుగురు కారులో మంత్రాలయం వెళ్తుండగా రెండు కార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానికులు ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా కర్ణాటకలోని కోలార్ జిల్లా చిన్న హోసపల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులకు సూచించారు.
Also Read: థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుండి వలసలు నిలిపివేత: డొనాల్డ్ ట్రంప్