హైల్త్ కార్డులతో ఉద్యోగులకు ఆరోగ్య భరోసా
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఉద్యోగులకు ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డులతో ఆరోగ్య భరోసా లభించిందని జలమండలి పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డులను వినియోగించుకునే విధానంపై, హెల్త్ కార్డుల ద్వారా కలిగే ప్రయోజనాలపై శుక్రవారం ఎస్.ఆర్.నగర్‌లోని జలమండలి డివిజన్-6 కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. దీంతో పాటు యశోద హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరం కూడా నిర్వహించారు. ఇందులో జలమండలి సిబ్బందికి వివిధ వైద్యపరీక్షలు నిర్వహించడం జరిగింది. సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎంలు ఎంఏ ఖాదర్, ప్రభు, జీఎం హరిశంకర్, జలమండలి ఉద్యోగులు పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరం శనివారం(18.12.2021) ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జరగనుంది. శనివారం ఉదయం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని జలమండలి ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు కోరారు.