IRCTC: హాస్పిటాలిటి మానిటర్స్ పోస్టులు
IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) లో 46 హాస్పిటాలిటి మానిటర్స్ పోస్టులు కలవు. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
బిఎస్స్‌సి (హాస్పిటాలిటి అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) లో ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.30వేలు అందుతుంది. నవంబర్ 13, 14 తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరుకావల్సి ఉంది.
వేదిక.. ఐఆర్‌సిటిసి, సౌత్ సెంట్రల్ జోన్ జోనల్ ఆఫీస్, 1వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా , సరోజినీ దేవి రోడ్ , సికింద్రాబాద్-500 003.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 2025 జనవరి 1వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులకు 5 ఏళ్లు.. ఒబిసిలకు 3 ఏళ్లు.. పిడబ్ల్యుబిడిలకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది.
[…] IRCTC: హాస్పిటాలిటి మానిటర్స్ పోస్టులు… […]
[…] IRCTC: హాస్పిటాలిటి మానిటర్స్ పోస్టులు… […]