కెజిఎఫ్ నటుడు హరీష్ రాయ్ కన్నుమూత
బెంగళూరు (CLiC2NEWS): కెజిఎఫ్ నటుడు హరీశ్ రాయ్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (గురువారం) కన్నుమూశారు. సూపర్ హిట్ మూవీ కెజిఎఫ్ లో ఖాసీం చాచాగా అందరికి గుర్తుండిపోయే పాత్రను హరీశ్ పోషించారు. 1995వ సంవత్సరంలో వచ్చిన ఓం సినిమాలో డాన్ రాయ్‌గా అందరిని అలరించారు.
గతంలో ఆయన తన అనారోగ్యం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. సాయం చేయాలని కోరారు. దాంతో కొందరు హీరో ఆర్థికంగా సాయం చేశారు.