ష‌ర‌తుల‌తో కూడిన వేత‌నాల పెంపుకు నిర్మాత‌లు ఒకే

నొ చిప్పిన ఫెడ‌రేష‌న్

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినీ కార్మికుల వేత‌నాల పెంపుకు నిర్మాతలు ఓకే చెప్పారు. కానీ.. కొన్ని ష‌ర‌తుల మేర‌కు వేత‌నాల‌ను పెంచేందుకు సుముఖంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌త కొన్ని రోజులుగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న పరిస్తితుల గురించి తెలిసిన విష‌య‌మే. వారం రోజులుగా కొన‌సాగుతున్న చ‌ర్చ‌లు కొలిక్కి వ‌చ్చాయి. వేత‌నాల పెంపుపై నిర్మాత‌లు త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. మొత్తం మూడు విడ‌త‌లుగా వేత‌నాలు పెంచాల‌ని నిర్ణ‌యించారు.

రోజుకు రూ.2 వేలు క‌న్నా త‌క్కువ తీసుకుంటున్న వారికి వేత‌నాలు పెంచాల‌ని నిర్ఱయించారు. వారికి మొద‌టి ఏడాది 15శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచడం. రూ.1000 కంటే త‌క్కువ వేత‌నం తీసుకునే వారికి ఒకే సారి 20 శాతం పెంచ‌టం.. వీరికి రెండో ఏడాది ఎలాంటి పెంపు ఉంద‌దు. మూడో ఏడాది 5 శాతం పెంచ‌టం. అర్హ‌త క‌లిగిన వారికి వేత‌నాల పెంపు ఇవ్వాల‌న్న‌దే వారి అభిప్రాయ‌మ‌ని.. ప్ర‌స్తుతం రోజుకు నాలుగైదు వేల రూపాయ‌ల వేత‌నం తీసుకుంటున్న వారికి కూడా వేత‌నాలు పెంచ‌మ‌న‌డం స‌రికాద‌న్నారు. బ‌డ్జెట్ ప‌రంగా చిన్న సినిమాల‌కు పాత వేత‌నాలే కొన‌సాగుతాయ‌న్నారు. ఈ మేర‌కు ఫిల్మ్ ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి దామోద‌ర ప్ర‌సాద్ వెల్ల‌డించారు.

కానీ.. ష‌ర‌తుల‌తో కూడిన వేత‌నాల పెంపున‌కు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ నేత‌లు అంగీక‌రించ‌లేదు. వేత‌నాల పెంపు విష‌యంలో నిర్మాత‌ల నిర్ణ‌యాన్ని అంగీక‌రించేది లేద‌ని ఫెడ‌రేష‌న్ నేత‌లు తేల్చి చెప్పారు. నిర్మాత‌లు విధించిన ష‌ర‌తుల‌కు ఒప్పుకునేదే లేద‌న్నారు. వారి నిర్ణ‌యం యూనియ‌న్ల ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని ఆరోపించారు. రోజువారీ వేత‌నాలు తీసుకునే 13 సంఘాల‌కు ఒకే విధంగా వేత‌నాల పెంపు ఉండాల‌ని ఫెడ‌రేష‌న్ నేత‌లు డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.