భారీ వర్షాలు.. గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ఓ ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీ జైత్‌పుర్‌లోని హరినగర్‌లో చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఢిల్లీ నిన్న రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న నివాసాల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
Also Read: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన..