శ్రీ‌శైలం స‌మీపంలో చిన్నారిపై చిరుత దాడి

శ్రీ‌శైలం (CLiC2NEWS): ప్ర‌కాశం జిల్లా దోర్నాల మండ‌లం చిన్నారుట్ల చెంచు గ‌గూడెంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. కుడుముల అంజ‌య్య‌, లింగేశ్వ‌రిల కుమార్తె ను ఆర్ధ‌రాత్రి నిద్రిస్తున్న స‌మ‌యంలో చిరుత ఈడ్చుకెళ్లింది. తండ్రి కేక‌లు వేసి చిరుత‌ను వెంబ‌డించాడు. దీంతో ఆ చిరుత గ్రామ శివారు ప్రాంతంలో వ‌దిలేసి వెళ్లింది. తీవ్రంగా గాయ‌ప‌డిన చిన్నారిని ఆస్ప‌త్రితో చికిత్స‌నందిస్తున్నారు. చెంచుగూడెం శ్రీ‌శైలానికి 12 కిలోమీట‌ర్లు దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి ఇప్ప‌టి వ‌ర‌కు విద్యుత్ సౌక‌ర్యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

1 Comment
  1. […] Also read: శ్రీ‌శైలం స‌మీపంలో చిన్నారిపై చిరుత … […]

Leave A Reply

Your email address will not be published.