అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న నిందితుడు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): బిహార్ నుండి అక్రమంగా ఆయుధాల తీసుకొచ్చి సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఒటి అధికారులు సంయుక్తంగా నిందితుడిని పట్టుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుండి 3 తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి, సులువుగా డబ్బు సంపాదించడం కోసం ఆయుధాలు విక్రయిస్తున్నట్లు సమాచారం.